తూర్పుగోదావరి జిల్లాలోని మన్యం, కోనసీమ ప్రాంతాలు గోదావరి ముంపు బారి నుండి కోలుకుంటున్నాయి. వరద ప్రవాహం తగ్గడంతో...పారిశుద్ధ్య నిర్వహణతో పాటు విద్యుత్, రహదారులు, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. పాఠశాలలు, అంగన్వాడీ వంటి ప్రభుత్వ భవనాల పునరుద్ధరణ పనులు 80శాతం పూర్తయినట్లు చెప్పారు. కోనసీమలోని 8మండలాలతో పాటు జిల్లాలో మొత్తం 11మండలాల్లో 2వేల 593హెక్టార్లలో ఉద్యాన పంటలు నష్టపోయినట్లు...దీంతో సుమారు 6వేల మంది రైతులకు 5కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు.
కోలుకుంటున్న ముంపు ప్రాంతాలు... - manyam
గోదావరి వరద ముంపు బారి నుండి తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. వరద ఉద్ధృతి తగ్గడంతో...పునరుద్ధరణ పనులు వేగవంతం చేసామని జిల్లా కలెక్టర్ తెలిపారు.
విద్యుత్, రహదారులు, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి