కోనసీమలో గోదావరి నది పాయలైన వశిష్ఠ, వైనతేయ, గౌతమీ వడివడిగా ప్రవహిస్తున్నాయి. వెదురు బియ్యం, అప్పనపల్లి, చాకలి పాలెం, జీ పెదపూడి వద్ద కాజువేలు ముంపునీటిలోనే ఉన్నాయి. లంక గ్రామాల ప్రజలు కొంతవరకు పడవలపై వస్తున్నారు. కొత్తపల్లి, నాగుల్ లంక, వీరవల్లిపాలెం తదితర గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది. పంటలు మునిగిపోయి రైతులు, గ్రామ వాసులు అన్ని విధాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గోదారి ఉద్ధృతి..కోనసీమలో ప్రజల ఇక్కట్లు - east godavari
గోదావరి వరద ఉద్ధృతి ఇంకా కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని గ్రామాల్లోకి ప్రవేశించి అక్కడి వాసులను ఇక్కట్లకు గురిచేసింది. నిన్న కురిసిన వర్షానికన్నా... ఈ రోజు మధ్యాహ్నం ఆ ప్రాంతంలోకి వచ్చే వరద నీరు ఎక్కువగా ఉంది.
కోనసీమలో కొనసాగుతున్న గోదారి ఉద్ధృతి