గోదావరి వరద ఉద్ధృతితో కోనసీమ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలు వరద ముంపు భయంతో బతుకుతున్నారు. గోదావరి నుంచి దిగువకు పెద్దఎత్తున వరద నీరు విడుదల అవుతున్నందున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఐ.పోలవరం, ముమ్మిడివరం, అయినవల్లి మండలాల్లో గోదావరి ఉద్ధృతి ఎక్కువగా ఉంది. శనివారం రాత్రి అయినవిల్లి మండలం ఎదురుబిడియం వద్ద కాజ్వే నీట మునగి అయినవెల్లి లంక, అద్దంకివారి లంక, విరవెల్లిపాలెం, పల్లపులంక గ్రామాల మధ్య ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐ.పోలవరం మండలం ఎదుర్లం, పశువుల్లంక తదితర లంక గ్రామాలు నీటమునిగే అవకాశముంది. ఆదివారం ఉదయానికి ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ దళాల సాయంతో అధికారులు లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సమాయత్తమవుతున్నారు.
ఉప్పొంగిన గోదావరి... కోనసీమ ప్రజల అలజడి - east and west godavari
గోదావరి వరద ఉద్ధృతితో కోనసీమ ప్రజలు భయంతో బతుకుతున్నారు. ఎదురుబిడియం వద్ద కాజ్వే నీట మునిగి లంక గ్రామాలు నీట మునిగే అవకాశముంది. ఎన్టీఆర్ఎఫ్ దళాల సాయంతో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమవుతున్నారు.
ఉప్పొంగిన గోదావరి... కోనసీమ ప్రజల అలజడి