ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాంలో 5 రూపాయలకే భోజనం! - five rupees_meals_in_yanam

కేంద్ర పాలిత యానాంలోనూ 5 రూపాయలకే భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దిల్లీకి చెందిన ఐఎఫ్​సీఐ లిమిటెడ్ సంస్థ, యానాం ప్రజా స్వచ్ఛంద సేవా సంస్థలు కలిసి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి.

'యానాంలో 5రూపాయలకే భోజనం'

By

Published : Jun 6, 2019, 7:33 PM IST

'యానాంలో 5రూపాయలకే భోజనం'

కేంద్రపాలిత యానాంలో 5 రూపాయలకే పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. తమిళనాడు ప్రభుత్వం అమ్మ క్యాంటీన్​, రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ అమృత హస్తం ద్వారా 5 రూపాయలకు ఒకపూట భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే. యానాంలో మాత్రం అందుకు భిన్నంగా.. రాజకీయ పార్టీలకు అతీతంగా దిల్లీకి చెందిన ఐఎఫ్​సీఐ లిమిటెడ్ సంస్థ సౌజన్యంతో... యానాం ప్రజా స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంలో ఈ కార్యక్రమం నిర్వహించటం విశేషం. పేదలకు తక్కువ ఖర్చుతో కడుపునింపే కార్యక్రమాన్ని సీఎఫ్​ఐ సంస్థ ప్రతినిధులతో కలిసి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు.

ప్రతి రోజు వెయ్యి మందికి...

ప్రతి రోజు పది ప్రాంతాల్లో వెయ్యి మందికి భోజనం అందించనున్నారు. వివిధ రకాల పనులపై ఇతర ప్రాంతాల నుంచి యానాం వచ్చిన వారికి, ఒంటరిగా జీవించే వారికి ఆహారాన్ని అందించేందుకు ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేశారు.

ఇవీ చూడండి-అన్నదాత-సుఖీభవ పథకం రద్దు

ABOUT THE AUTHOR

...view details