గ్లాస్‌హౌస్ సెంటర్లో అగ్నిప్రమాదం
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని గ్లాస్‌హౌస్ సెంటర్లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. 7 గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
కాకినాడ శర్వాణీ సూపర్ మార్కెట్లో చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చాయి.ఎనిమిది అగ్నిమాపక యంత్రాల సాయంతో...సుమారు7గంటలపాటు శ్రమించి అగ్నికీలలను చల్లార్చారు.తెల్లవారుజామున3గంటల సమయంలో...గ్లాస్ హౌస్ సెంటర్లోని సూపర్ మార్కెట్లో ప్రమాదం సంభవించింది.విద్యార్థుల బ్యాగులు,సూట్ కేసుల వంటి సామాగ్రి పెద్దమొత్తంలో ఆహుతయింది.సూపర్ మార్కెట్ లో ప్రవేశానికి ఒకే మార్గం ఉండటంతో మంటలు అదుపులోకి తీసుకురావడం కష్టమైంది.రెండువైపులా షాపులు,వెనుకవైపు నివాస గృహాలు ఉండటంతో పరిస్థితిని అదుపు చేసేందుకు ఎక్కువ సమయం పట్టిందని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు.అగ్నిప్రమాదాలు సంభవిస్తే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త ఏర్పాట్లేవీ శర్వాణీ సూపర్ మార్కెట్లో లేనట్లు అధికారులు వెల్లడించారు.సుమారు55లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని యజమాని ముత్తా భగవాన్ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రమాదానికి కారణాలపై విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.