ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విత్తనాలు అందడం లేదని రైతుల ఆందోళన - Farmers worry that the seeds are not getting

ఖరీఫ్ సీజన్​లో ప్రభుత్వం విత్తనాల అందించక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతుల నిరసన తెలిపారు.

east godavari district
విత్తనాలు అందడం లేదని రైతుల ఆందోళన

By

Published : Jun 22, 2020, 6:58 PM IST

ఖరీఫ్​ సీజన్​లో విత్తనాలు అందించకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండల రైతులు స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పంచాయతీలో సుమారు వందమందికి పైగా 90 శాతం రాయితీపై విత్తనాలు పొందేందుకు ఒక్కొక్కరు వంద రూపాయలు చొప్పున వాలంటీర్లకు ఇచ్చామని, కానీ విత్తనాలు అందుబాటులో లేవని వస్తే ఇస్తామని వ్యవసాయ అధికారులు చెబుతున్నారని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

నారుమడులకు అంతా సిద్ధం చేసుకునే సరికి విత్తనాలు లేవంటూ అధికారులు చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. రంపచోడవరం పంచాయతీలో చెరువు పాలెంలో 34 మంది రైతులు ఒక్కొక్కరు వంద రూపాయలు చెల్లించాలన్నారని తెలిపారు. పందిరిమామిడి గ్రామంలో రైతులు విత్తనాల కోసం డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా విత్తనాలు లేవని గ్రామ వాలంటీర్లు తిరస్కరించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఐటీడీఏ ఇన్​ఛార్జీ పీవో, సబ్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్యకు వినతి పత్రాన్ని అందించారు.

ఇది చదవండిగవర్నర్​తో సీఎం జగన్ భేటీ.. తాజా పరిస్థితులపై చర్చ!

ABOUT THE AUTHOR

...view details