తమ పంట పొలాలకు వెళ్లే దారిని అక్రమించారని ఆరోపిస్తూ,తూర్పుగోదావరి జిల్లా గోకివాడలో రైతులు వాటర్ ట్యాంకు ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు.సుమారు100ఎకరాల పొలాలకు వెళ్లే,పుంతరోడ్డును ఆ ఊరికే చెందిన రేవాడ వసంతరావు అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడని రైతులు ఆరోపించారు.దీనిని ప్రశ్నించిన రైతులను వసంతరావు బెదిరిస్తున్నాడని చెప్పారు.సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు.తమకు చివరి ప్రయత్నంగా చావే శరణ్యమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని,సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.దీంతో రైతులు ఆందోళన విరమించారు.
ఆత్మహత్య చేసుకుంటామని వాటర్ ట్యాంకు ఎక్కిన రైతులు - Farmers commit suicide by climbing water tank
తూర్పుగోదావరి జిల్లా గోకివాడలో వంద ఎకరాలకు దారిగా ఉన్న పుంతరోడ్డును, అదే ఊరికి చెందిన వ్యక్తి ఆక్రమించుకున్నాడని ఆరోపిస్తూ, రైతులు నీళ్ల ట్యాంకును ఎక్కారు. సమస్యను పరిష్కరించకపోతే ఆత్మహత్య చెసుకుంటామని హెచ్చరించారు.
వాటర్ ట్యాంకు ఎక్కి రైతులు ఆత్మహత్యాయత్నం
TAGGED:
వాటర్ ట్యాంకు