తూర్పుగోదావరి జిల్లా సమీపంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు మొత్తం 1215 మంది ఈ మహమ్మారి బారిన పడగా... 183 మంది ప్రభుత్వాసుపత్రిలో.. మరో126 మంది ఇంటి వద్దనే ఉంటూ డాక్టర్ల పర్యవేక్షణలో వైద్య సేవలు పొందుతున్నారు. 872 మంది సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు వెళ్లిపోయారు. అధిక రక్తపోటు.. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కరోనా సోకి 34 మంది మరణించినట్లు పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు.
యానాం ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకలు.. రెండు ప్రత్యేక కొవిడ్ కేర్ సెంటర్లలో 180 పడకలు అందుబాటులో ఉండగా.. చికిత్స పొందుతున్న వారికి సేవలందించేందుకు సిబ్బంది కొరత ఏర్పడింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలలో బాధితుల సంఖ్య రోజుకు వందకుపైగా ఉండడంతో వారికి సేవలు అందించేందుకు... పుదుచ్చేరి ప్రభుత్వం స్థానికులకు, తగిన విద్యార్హత కలిగిన వారిని 3 నెలల కాల పరిమితితో తాత్కాలికంగా నియమించారు.