ముఖ్యమంత్రి జగన్ స్వగ్రామమైన పులివెందులలో ఎస్సీ మహిళ దారుణ హత్యకు గురవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి మండిపడ్డారు. ఘటనను నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని దుయ్యబట్టారు.
'ముఖ్యమంత్రి స్వగ్రామంలోనే మహిళలకు రక్షణ లేదు'
దిశ చట్టం, మహిళలకు ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసినా.... సరిగ్గా అమలు కాలేదని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆరోపించారు. పులివెందులలో ఎస్సీ మహిళ హత్య ఘటనపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ముఖ్యమంత్రి స్వగ్రామంలోనే మహిళలకు రక్షణ లేదు'
దిశ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చామని, ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశామని సీఎం చెబుతున్నారని.. కానీ ఆచరణ సాధ్యం కావడం లేదని విమర్శించారు.
ఇవ చదవండి