ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 4, 2021, 5:35 PM IST

ETV Bharat / state

'ప్రతి మహిళ.. దిశ యాప్​ డౌన్లోడ్​ చేసుకోవాలి'

దిశ యాప్​ను ప్రతి మహిళ డౌన్లోడ్​ చేసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా జాయింట్​ కలెక్టర్​ జి. రాజకుమారి సూచించారు. గన్నవరం మండలం చాకలి పాలెంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

disha-app
దిశా యాప్​

మహిళల రక్షణార్థం ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశా యాప్​ను ప్రతి ఒక్కరూ స్మార్ట్​ఫోన్​లో డౌన్లోడ్ చేసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ జి. రాజకుమారి సూచించారు. దిశ చట్టం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. గన్నవరం మండలం చాకలి పాలెంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పిల్లలు వ్యసనాలకు బానిస కాకుండా.. వారికి నైతిక విలువలు బోధించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని గుర్తు చేశారు.

జిల్లాలో 15 లక్షల మంది మహిళలు దిశ యాప్​ను డౌన్లోడ్ చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి మహిళ ప్రతి యువతి దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుందని ఆమె వివరించారు. ఈ సదస్సుకు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అధ్యక్షత వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలు యువతుల రక్షణ కోసం ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా దిశ యాప్ (disha app), దిశా చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చిందని ఎమ్మెల్యే వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details