8మండలాల్లో విస్తరించి ఉన్న ఏలేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరడం వేల ఎకరాల్లో వరి, పత్తి, ఉద్యానపంటలు జలమయమయ్యాయి. గొల్లప్రోలు, కాకినాడ గ్రామీణ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు వారానికిపైగా వరద నీటిలోనే ఉండిపోయాయి. ఏలేరు కాలువకు 37 చోట్లకుపైగా గండిపడి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది.
ఏమేరకు పనులు పూర్తి...
ఏలేరు జలాశయం పూర్తి నీటి సామార్ధంయ 24.11 టీఎంసీలు. ఏలేరు కాలువలపైనే ఏకంగా 57 ఎకరాల భూమి సాగు అవుతుంది. జలాశయం ఆధునీకరణ పనులు ఆరేళ్ల క్రితం చేపట్టి, తొలిదశలో భాగంగా 127 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించగా ఇప్పటివరకు కేవలం 52 శాతం పనులు పూర్తయ్యాయి. తొలి దశ పనులు 92 శాతం వరకు పూర్తి అయినా.. కాలువాల ఆధునీకరణ పనులు 10శాతం కూడా పూర్తి కాలేదు. ఇందుకు ముఖ్యంగా కాలువల విస్తరణలో భూసేకరణ ముందుకు సాగకపోవడం పెద్ద సమస్యగా మారింది. కొన్ని ప్రాంతాల్లో కాలువ ఆక్రమణకు గురైనా కనీసం తాత్కాలిక పనుకు కూడా చేపట్టలేదు. ఫలితంగా భారీ వర్షాలకు వేలాది ఎకరాల పంటలను, లోతట్టు ప్రాంతంలో ఉన్న జనావాసాలను ముంచెత్తింది.