తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తునిలో ఎన్నికల సిబ్బందికి సామగ్రి అందించే కేంద్రాన్ని... కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేసి, ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. అనపర్తిలో రేపటి పరిషత్ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్నికల సిబ్బందికి అధికారులు సామగ్రి పంపిణీ చేశారు.
కొత్తపేట మండలంలో గురువారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... ఆయా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా సిబ్బందికి విధులు కేటాయిస్తున్నారు. ప్రత్తిపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని డీఆర్ఓ సత్తిబాబు పరిశీలించారు. అమలాపురం డివిజన్లోని 16 మండలాలకు సంబంధించి... పరిషత్ ఎన్నికల నిమిత్తం పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకున్నారు. అమలాపురం డివిజన్లో మొత్తం 332 ఎంపీటీసీ స్థానాలు ఉండగా... అందులో 14 ఏకగ్రీవమయ్యాయి.