'యువత సరైన దారిలో నడిస్తేనే దేశాభివృద్ధి' - rajamahaendra varam
మంచి విత్తనం లేకుండా మొక్క రాలేదు. మంచి పౌరులు లేకుండా సమాజం ఏర్పడదని ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్ అభిప్రాయపడ్డారు. యువత నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు.
ప్రపంచంలోనే ఎక్కువ శాతం యువత భారతదేశంలోనే ఉన్నారని... వారిని సరైన దారిలో నడిపిస్తే దేశాభివృద్ధిని ఎవరూ ఆపలేరని ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కలవగొయ్యిలోని శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థల 33వ వార్షికోత్సవాలకు ఆయనతో పాటు.... అంతర్జాతీయ టేబుల్‌టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్... ప్రముఖ సినీ గీత రచయితలు రామజోగయ్య శాస్త్రి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి