ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రణాళికయుతమైన బోధనతోనే ఫలితాల్లో అగ్రస్థానం

పది ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా ప్రథమ స్థానం కైవసం చేసుకోవడంపై జిల్లా విద్యాశాఖాధికారి ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల కృషితోనే ఇది సాధ్యమైందని చెప్పారు.

By

Published : May 14, 2019, 9:03 PM IST

అబ్రహాంకు స్వీట్ తినిపిస్తున్న విద్యాశాఖ సిబ్బంది

తూ.గో.విద్యాశాఖ అధికారి అబ్రహాం

పాఠశాల విద్యా శాఖ విడుదల చేసిన పది ఫలితాల్లో 98.19శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. దీనిపై తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి అబ్రహం హర్షం వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయ సిబ్బందితో తమ సంతోషం పంచుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల సమష్టి కృషితోనే ఈ ఘనత సాధ్యమైందన్నారు. జిల్లాలో మొత్తం 5వేల 456మంది విద్యార్థులు పదికి పది జీపీఏ సాధించినట్లు తెలిపారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. నాలుగేళ్ల నుంచి పదికి పది జీపీఏ సాధించడంలో తూర్పు గోదావరి జిల్లా అగ్రస్థానంలో నిలుస్తోంది. మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలకు జిల్లా నుంచి 68వేల 324మంది విద్యార్థులు హాజరుకాగా వారిలో 67వేల 88మంది ఉత్తీర్ణత సాధించారు..

ABOUT THE AUTHOR

...view details