లాక్డౌన్ సడలింపు ఇచ్చిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో మద్యం దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. సీఆర్సీ రోడ్డులో మద్యం దుకాణాల వద్ద పరిస్థితిని డీఎస్పీ షేక్ మష్రూమ్ బాషా పరిశీలించారు. సడలింపుల నేపథ్యంలో బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ధరించాల్నారు. దుకాణదారులు, ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని దుకాణాలకు వచ్చే ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఒక్కొక్కరు లోనికి వచ్చే విధంగా చూడాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.
'నిబంధనలు అతిక్రిమిస్తే కఠిన చర్యలు తప్పవు'
మద్యం దుకాణదారులు నిబంధనలు పాటిస్తూ విక్రయాలు చేసుకోవాలని.. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తామని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డీఎస్పీ షేక్ మష్రూమ్ బాషా హెచ్చరించారు.
east godavari dst dsp vists wine shops and council the shop owners