ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రశాంతంగా ముగిసిన ఎంసెట్ పరీక్షలు

కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంసెట్ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి.

ప్రశాంతంగా ముగిసిన ఎంసెట్ పరీక్షలు

By

Published : Apr 25, 2019, 6:33 AM IST

రాష్ట్రంలో ఐదురోజుల పాటు 115 కేంద్రాల్లో ఎంసెట్ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదని కన్వీనర్ సాయిబాబా తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో 94.80 శాతం, వ్యవసాయ, వైద్య విభాగంలో 94.16 శాతం హాజరు నమోదైనట్లు చెప్పారు. ఇంజనీరింగ్ విభాగంలో లక్షా 95వేల 908 మంది విద్యార్థులకు గాను.. లక్ష 85 వేల 711 మంది పరీక్షకు హాజరయ్యారు. వ్యవసాయ, వైద్య విభాగంలో 86 వేల 993 విద్యార్థులకు గాను.. 81 వేల 916 మంది హాజరయ్యారని వివరించారు. హైదరాబాద్ లో ఎంసెట్ పరీక్షకు 90.61 శాతం హాజరైనట్టు చెప్పారు. ఇంజనీరింగ్ పరీక్ష ప్రాథమిక కీ పై అభ్యంతరాలను ఈనెల 26 సాయంత్రం 5గంటలలోపు ... వ్యవసాయ, వైద్య విభాగం పరీక్ష కీ పై అభ్యంతరాలను ఈనెల27 సాయంత్రం 5 గంటాలకల్లా తమ అభ్యంతరాలను apeamcet2019objections@gmail.com" మెయిల్ కు పంపాలన్నారు. మే రెండో వారంలో ఫలితాలు వెల్లిడించేందుకు సన్నాహాలు చెస్తున్నట్టు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details