లాక్డౌన్ కారణంగా పేదలు, కూలీలు, చేతివృత్తుల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో చేతి వృత్తులు, కులవృత్తులు, నాయి బ్రాహ్మణులు పనిలేక ఆవేదన చెందుతున్నారు. దాతలు అందించే సహాయంతోనే జీవనం సాగించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పూట తిని మరో పూట పస్తులుంటున్నామని వాపోతున్నారు.
దాతల సహాయంతోనే ఆ పూట కడుపు నిండుతుంది.. లేకుంటే పస్తులే
లాక్డౌన్ కారణంగా పేదలు, కూలీలు పరిస్థితి దయనీయంగా మారింది. రెక్కాడితే కానీ డొక్కాడని వారు పనుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా దాతలు సహాయం చేస్తేనే ఆ పూట వారి కడుపు నిండుతుంది. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో పేదలు లాక్డౌన్తో అవస్థలు పడుతున్నారు.
helping to poor people