తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి హైదరాబాద్కు చెందిన సైనెట్ గ్లోబల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ వారు కంప్యూటర్లు అందించారు. స్వామివారి వ్రతాన్ని యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అవసరమైన పరికరాలను సమకూర్చారు. సుమారు రూ.4 లక్షలు విలువైన వాటిని ఉచితంగా అందించడంతో ఆలయ ఈవో త్రినాథరావు దాతను అభినందించారు.
అన్నవరం దేవస్థానానికి కంప్యూటర్లు అందజేత - annavaram temple latest news
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి సైనెట్ గ్లోబల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థ కంప్యూటర్లను అందించింది. స్వామివారి వ్రతాల ప్రత్యక్ష ప్రసారాలకు పరికరాలను ఇచ్చినట్లు సంస్థ అధికారులు తెలిపారు.
అన్నవరం దేవస్థానానికి కంప్యూటర్లు అందించిన సైనెట్ గ్లోబల్ సంస్థ