తూర్పుగోదావరి జిల్లాలో అపరాల పంపిణీలో జరిగిన అవకతవకలపై ఈనాడు- ఈటీవీ భారత్ లో వచ్చిన కథనాలకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు విచారణ చేపట్టారు. కొత్తపేట, రావులపాలెం మండలాల్లో75 శాతం రాయితీతో మినుములు, పెసలు వ్యవసాయ శాఖ అధికారులు తీసుకున్నారు. కానీ అవి రైతులకు చేరలేదని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ నిర్వహించినట్టువ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామారావు తెలిపారు. రైతులందరినీ ప్రాథమిక విచారణ చేసి... నివేదికను గుంటూరులోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయానికి పంపిస్తామని చెప్పారు. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో... ఈ విత్తనాలకు సంబంధించి రాయితీని విడుదల చేయకుండా నిలుపుదల చేశామన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అపరాల పంపిణీలో అక్రమాలపై విచారణ - కొత్తపేట
ఈనాడు- ఈటీవీ భారత్లో వచ్చిన కథనాలకు స్పందించిన తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు... అపరాల పంపిణీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టారు.
అపరాల పంపిణీలో జరిగిన అక్రమాల పై విచారణ