తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నా.. వసతి గదుల కేటాయింపు నిలిపివేశారు. ముందుగా వసతి సముదాయంలో సగం గదులను, గది విడిచి గదిని కేవలం దంపతులు ఇద్దరికి కేటాయించాలని నిర్ణయించారు. కానీ, కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అన్నవరం ఆలయంలో కొండపై ఉన్న వసతి గదులను కేటాయించవద్దన్న దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కేటాయింపు నిలిపివేశారు.
అన్నవరంలో వసతి గదుల కేటాయింపు నిలిపివేత
అన్నవరం దేవస్థానంలో స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు వసతి గదుల కేటాయింపు నిలిపివేశారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అన్నవరం దేవస్థానంలో వసతి గదుల కేటాయింపు నిలిపివేత
Last Updated : Oct 18, 2022, 11:55 AM IST