తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆర్టీసీ గ్యారేజ్‌లో సాంకేతిక నిపుణులు తయారు చేసిన శానిటైజర్ మిషన్ ఆకట్టుకుంటోంది. ఆలోచనాత్మకంగా తయారు చేసిన ఈ పరికరాన్ని పాడైన బస్సుల్లోని పెడల్స్, ఇతర సామగ్రిని ఉపయోగించి తయారు చేశారు. గ్యారేజీలో విధులు నిర్వహించే సిబ్బంది కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించేందుకు ఈ పరికరం ఏర్పాటు చేశారు. చేతులకు పని లేకుండా కాళ్లతో ఒత్తితే శానిటైజర్, వాటర్ రావడం ఈ పరికరం మొక్క ప్రత్యేకత. అలాగే ఒకే చోట శానిటైజర్ ట్యాంకును, నీళ్ల ట్యాంకును ఏర్పాటు చేయడం సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ ఆలోచన అదుర్స్ - అమలాపురం తాజా వార్తలు
చేతులకు పని లేకుండా కాళ్లతో ఒత్తితే శానిటైజర్, వాటర్ వచ్చేలా తూర్పు గోదావరి జిల్లా అమలాపురం ఆర్టీసీ గ్యారేజ్ సాంకేతిక నిపుణులు ఓ కొత్త పరికరాన్ని తయారు చేశారు. చేతులకు పని లేకుండా ఒకే చోట శానిటైజర్, నీళ్లు కూడా రావడంపై సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ సాంకేతిక సిబ్బంది రూపొందించిన హ్యాండ్ వాష్ విషన్