తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్‌కు మండపేట గ్రామానికి చెందిన వంకా నరేంద్ర బాబు, సుజాత దంపతులు విరాళం ఇచ్చారు. స్వామి వారి సన్నిధిలో అధికారులకు రూ.2.80 లక్షల చెక్కును అందజేశారు. వీరికి దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు, ధర్మకర్త మండలి సభ్యులు, కార్యనిర్వహణాధికారి, అర్చక స్వాములు... స్వామి వారి చిత్రపటాన్ని అందించి కృతజ్ఞతలు తెలియజేశారు.
వాడపల్లి వెంకటేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్‌కు భక్తుడి విరాళం - vadapalli venkateswara swamy latest news
కోనసీమ తిరుపతిగా పేరు గాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్‌కు ఓ భక్తుడు రూ. 2.80 లక్షల విరాళం అందించారు.
స్వామి వారి ట్రస్ట్‌కు విరాళం అందించిన భక్తునికి చిత్రపటం అందించిన ఆలయ అధికారులు