- మూడు రోజులైంది. విద్యుత్ సరఫరా సరిగా లేదు
- కనీసం తాగునీరు అందడం లేదు
- రాత్రి వానకు తడుస్తున్నాం.. పొద్దున ఎండకు ఎండుతున్నాం
- పదిరోజులకోసారి గోదారి పొంగుతోంది. మా బతుకులు ఇంతేనా?
- మాకు శాశ్వత పరిష్కారం కావాలి. వేరే చోట ఇళ్లిస్తే వెళ్లిపోతాం
బతకలేకపోతున్నాం.. మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయండి - వరదలో మునిగిన దేవీపట్నం
ఎగువన కురుస్తున్న వర్షాలకు.. తూర్పు గోదావరి జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు వరద బారిన పడుతున్నాయి. గోదారి ఉప్పొంగిన కారణంగా.. దేవీపట్నం మళ్లీ ముంపు సమస్యను ఎదుర్కొంటోంది. ఆ ప్రాంత ప్రజలు.. భయాందోళనలకు గురవుతున్నారు.
ఇదీ.. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం ప్రజల ఆవేదన. భారీ వర్షాలకు సైతం భయపడని ఈ ప్రాంత ప్రజలు.. ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో.. ఏ విధంగా తమ ప్రాంతాలను ముంచేస్తుందో తెలియని వరదతో భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా.. ఎగువన కురుస్తున్న వర్షాలకు.. గోదావరి ఉప్పొంగింది. మళ్లీ.. నర్సీపట్నాన్ని వరద ముంచెత్తింది. ఇళ్లలోకి వరద పొంగుకొచ్చింది. పాములు, తేళ్లు జనాన్ని భయపెడుతున్నాయి. కొందరు ధైర్యం చేసి శిబిరాల్లో తల దాచుకుంటున్నా.. మరికొందరు మాత్రం ఇళ్లు వదిలి వెళ్లేందుకు ధైర్యం చేయలేక.. వరదతో సహజీవనం చేస్తున్నారు. ప్రతిక్షణం నరకయాతన అనుభవిస్తున్నారు. మరిన్ని వివరాలను.. దేవీపట్నం నుంచి ఈటీవీ భారత్ ప్రతినిధి అనిల్ అందిస్తారు.