ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బోటు ప్రమాద మృతుల కోసం గోదావరి పాయాల్లో గాలింపు - konaseema

దేవిపట్నం కచ్చులూరు వద్ద బోటు ప్రమాదంలోని మృతదేహాలు గోదావరి నదీ పాయల్లో కొట్టుకొస్తున్నాయన్న స్థానికుల సమాచారంతోఅధికార్లు రంగంలోకి దిగారు. అయితే, నీటిలో తేలియాడుతున్న కళేబరాలు పశువులకు సంబందించినవని అధికార్లు తేల్చారు.

గాలింపు

By

Published : Sep 18, 2019, 4:23 PM IST

గోదావరి నదీ పాయల్లో అధికారుల గాలింపు

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు బోటు ప్రమాదంలో మృతదేహాల గాలింపు కొనసాగుతోంది.దిగువన ఉన్న కోనసీమలోని గోదావరి నదీ పాయల్లోకి మృతదేహాలుకొట్టుకు వస్తున్నాయని పోలీసు,రెవెన్యూ అధికారులకు స్థానికులు సమాచారమిచ్చారు.పి గన్నవరం నియోజకవర్గంలోని ముంజవరం,పెదపట్నంలంక మధ్య గోదావరి నది పాయలో అధికార్లు గాలింపు చేపట్టారు.అయితే,నీళ్లలో తేలియాడుతూ కనిపిస్తున్న కళేబరాలు పశువులకు సంబందించినవని అధికార్లు తెలియజేశారు.అయితే,ఈ ప్రాంతంలో అన్వేషణ కొనసాగిస్తామని అధికార్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details