'చెరగని బాలయోగి ముద్ర' - death
తూర్పుగోదావరి జిల్లా ప్రజల హృదయాల్లో జీ.ఎమ్.సీ బాలయోగి చెరగని ముద్ర వేశారని.. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. జిల్లా తెదేపా కార్యాలయంలో బాలయోగి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
జీఎమ్సీ బాలయోగి వర్ధంతి కార్యక్రమం
తూర్పుగోదావరి జిల్లా ప్రజల హృదయాల్లో జీ.ఎమ్.సీ బాలయోగి చెరగని ముద్ర వేశారని.. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. జిల్లా తెదేపా కార్యాలయంలో బాలయోగి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాలయోగి పార్టీలకతీతంగా అభివృద్ధే ధ్యేయంగా పనిచేశారని చినరాజప్ప కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండబాబు, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రారావు తదితరులు పాల్గొన్నారు.