పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో వినాయక ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందగా..మరో బాలిక గాయాలతో బయటపడింది. నిడదవోలు వడ్డీల వీధిలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద పూజ అనంతరం ఫోటోలు దిగే సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో తంగెళ్లమూడి రఘరాం శాస్త్రి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలపాలైన బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
వినాయక ఉత్సవాల్లో అపశృతి...విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - వినాయక ఉత్సవాల్లో అపశృతి...విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
వినాయక చవితి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో వినాయక మండపం వద్ద విద్యుదాఘాతానికి గురై ఒకరు మరణించగా..మరో బాలిక గాయాల పాలైంది.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి