కోనసీమ ప్రాంతంలో 8 నెలల క్రితం తలపెట్టిన పక్కా డ్రెయిన్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పి గన్నవరం, అమలాపురం, కొత్తపేట, ముమ్మిడివరం, రాజోలు నియోజకవర్గాల పరిధిలో రూ.145కోట్ల నిధులతో 648 కొత్త డ్రైనేజి నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. గత ఏడాది డిసెంబర్లో నిధులు మంజూరయ్యాయి. కానీ, ఈలోపు ఇసుక లభ్యం కాకపోవటం, కరోనా కారణంగా కూలీలు రాకపోవటం వంటి కారణాలతో ఈ పనులు ఏడాది ఫిబ్రవరిలో మొదలయ్యాయి.
గ్రామాలలో నత్తనడకన పక్కా డ్రెయిన్ నిర్మాణ పనులు - East Godavari District Rural Water Supply Department Engineer T Gayatri Devi
తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభించిన పక్కా డ్రెయిన్ నిర్మాణ పనులు నెమ్మదించాయి. ఇసుక కొరత, కూలీలు లేకపోవటంతో పనులు నిలిచిపోయాయి.
తాజాగా ప్రభుత్వం మార్చి 31 నాటికి మొదలుపెట్టని పనులను నిలుపుదల చేస్తూ ఆదేశాలిచ్చింది. మార్చి 31 నాటికి మొదలు పెట్టిన పనులు పూర్తిచేయాలని తెలిపింది. ఇలా మార్చి 31 నాటికి మొదలుపెట్టిన పనులు 60 ఉన్నాయి. వీటి విలువ సుమారు 15 కోట్లు.. ఈ పనులు కూడా అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. చాలాచోట్ల ఈ పనులు ఆగిపోయాయి. మార్చి 31 నాటికి మొదలుపెట్టిన పనులు పూర్తి చేస్తామని ఆగిపోయిన పనులు కూడా చేసేందుకు వీలుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తూర్పు గోదావరి జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీర్ టి. గాయత్రి దేవి తెలిపారు.
ఇదీ చదవండికేజీబీవీ జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన