ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 17, 2020, 3:50 PM IST

ETV Bharat / state

ఇకనుంచి యానాంలోనే కరోనా నిర్థరణ పరీక్షలు: మంత్రి మల్లాడి

కరోనా నిర్థరణ పరీక్షలు ఇక నుంచి యానాంలో నిర్వహించేటట్లు ఏర్పాటు చేస్తున్నట్లు పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు వెల్లడించారు. యానాంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

yanam health minister
పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు

యానాంలో రోజురోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను దృష్టిలో పెట్టుకొని... వచ్చే వారం నుంచి యానాంలోనే పరీక్షలు నిర్వహించనున్నట్లు పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు వెల్లడించారు. ఇప్పటివరకు కరోనా అనుమాతుల నుంచి సేకరించిన నమూనాలను కాకినాడకు పంపేవారని... అక్కడ కేసులు ఉద్ధృతి పెరగటంతో బాధితుల ఫలితాలు రావటం ఒకింత ఆలస్యం జరుగుతుందన్నారు. ఇది యానాంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందటానికి ప్రధాన కారణంగా మారిందన్నారు. అందువల్లే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

కారెకాల్, మాహే, యానాంల కోసం పుదుచ్చేరి ప్రభుత్వం కొత్తగా ఆరు టెస్టింగ్ మిషన్లు కొనుగోలు చేసేందుకు సంబంధిత సంస్థకు ఆర్డర్ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ మిషన్లు వారం రోజుల్లో రానున్నట్లు తెలిపారు. 5 లక్షల విలువైన మిషన్లతో పాటు అందుకు అవసరమైన ల్యాబ్ టెక్నీషియన్లు ఇతర సిబ్బందిని నియమించటం జరిగిందన్నారు. వీటి ద్వారా రోజుకు 60 నుండి 90 మందికి పరీక్షలు నిర్వహించవచ్చుననీ.. ఫలితాలు అరగంట వ్యవధిలోనే వచ్చే అవకాశం ఉందన్నారు.

ఇదీ చదవండి:ఒక్క అంబులెన్స్​లో కుక్కి కుక్కి ఎక్కించారు... ఇంత నిర్లక్ష్యమా ? : చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details