ప్రభుత్వం కరోనా నియంత్రణకు తీవ్రంగా కృషి చేస్తుందని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అన్నారు. ప్రజలు భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు, శానిటైజర్లు వాడుతూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. చాలా మంది ప్రజలు కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షలు చేయించుకోడానికి భయపడుతున్నారని పేర్కొన్నారు. కొందరు కరోనా పాజిటివ్ గా నిర్ధరణ అయినప్పటికీ బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారన్నారు. అలా చేయడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. పేద వారికి ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించి పాజిటివ్ నిర్ధరణ అయిన వారికి అక్కడే మందుల పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారు భయపడాల్సిన అవసరం లేదని.. మందులు వాడుతూ ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నారు.
ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి: చిర్ల జగ్గిరెడ్డి - తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో మెగా కరోనా క్యాంప్ వార్తలు
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కరోనా మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు. కొత్తపేట ప్రభుత్వ కళాశాలల మైదానంలో ఎమ్మెల్యే సొంత ఖర్చులతో కరోనా టెస్టులు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు మందులు పంపిణీ చేశారు.
ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి: చిర్ల జగ్గిరెడ్డి