తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో తండ్రి, తనయుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా.. వీరి ద్వారా మరో ముగ్గురికి వైరస్ సోకిందని వైద్య అధికారులు తెలిపారు. ఇటీవల వీరిద్దరూ ఓ వివాహానికి హాజరయ్యారు. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు వీరు కలిసిన 85 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. ఈ ఫలితాల్లో వైరస్ సోకిన వ్యక్తి తల్లి, భార్యతో పాటు మరో వ్యక్తికి కొవిడ్ సోకిందని వైద్యులు నిర్ధరించారు. వీరిని బొమ్మూరు క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
అన్నవరంలో కరోనా బాధితుల నుంచి ముగ్గురికి సోకిన కొవిడ్ - అన్నవరం నేటి వార్తలు
తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో వైరస్ సోకిన తండ్రీ, కొడుకుల నుంచి ముగ్గురికి కరోనా సోకింది. వీరిని బొమ్మూరు క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.
అన్నవరంలో కరోనా బాధితుల నుంచి ముగ్గురికి సోకిన కొవిడ్