ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాతో ఆ గ్రామంలో మృత్యుఘోష.. పరిష్కరించాలని మంత్రి ఆదేశం

కరోనాతో తూర్పు గోదావరి జిల్లా గొల్లవిల్లి గ్రామస్థులు వణికిపోతున్నారు. రెండు వారాల్లో దాదాపు 8 మంది మహమ్మారి బారిన పడి చనిపోవడమే అందుకు కారణం. ఇదే విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. ఆ గ్రామంలోకి ఇతరులు రాకుండా రహదారులు మూసివేస్తున్నారు.

corona deaths in gollavilli
గొల్లివిల్లిలో కరోనా మరణాలు

By

Published : May 8, 2021, 3:49 PM IST

తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి గ్రామం కరోనాతో వణికిపోతోంది. రెండు వారాల్లో ఆ గ్రామంలో 14 మంది చనిపోగా... అందులో 8 మంది కొవిడ్ కాటుకు బలయ్యారని అధికారులు వివరించారు.

మిగిలిన ఆరుగురు కూడా ఈ కారణంతోనే మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ స్పందించి ఆ గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డికి సూచించారు. ఇతరులు ప్రవేశించకుండా దారులు మూసివేశారు.

ABOUT THE AUTHOR

...view details