తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం, ప్రత్తిపాడు మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి జూనియర్ సివిల్ జడ్జి - జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు పైకప్పు ముందు భాగం కుప్పకూలింది. రాత్రివేళ కావడం.. పైగా సెలవు దినం కావటంతో పెనుప్రమాదం తప్పింది.
100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కోర్టు భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఈ కోర్టు కోసం రూ.5 కోట్ల 30 లక్షలతో నిర్మిస్తున్న నూతన భవనం దాదాపు పూర్తి అయ్యింది. ఈ ఘటన నేపథ్యంలో నూతన భవనం త్వరగా ప్రారంభించాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. పనిదినాల్లో ఈ ప్రమాదం జరిగిఉంటే కోర్టుకు వచ్చే కక్షి దారులు, న్యాయవాదులమీద పైకప్పు పడేదని న్యాయవాదులు అంటున్నారు.