humanity in tuni: నా అన్నవారు రోడ్డున పడేయడంతో ఆ వృద్ధురాలి పరిస్థితి చూసి ఆమె జీవితం ముగిసిపోయిందనుకున్నారు. స్పందించిన హృదయాలు ఆమెను అక్కున చేర్చుకుని మళ్లీ ప్రాణం పోశాయి. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా పలువురు చూపిన చొరవ ప్రస్తుతం ఆమె మోములో చిరునవ్వులు చిందిస్తున్నాయి. ఓ వృద్ధాశ్రమంలో తన శేషజీవితాన్ని తోటి వారితో కలిసి సంతోషంగా జీవిస్తోంది.
old women saved in tuni: తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణం 14వ వార్డులో 2021 నవంబరు 29 రాత్రి 8 గంటలకు.. ఆంజనేయస్వామి గుడి ఎదురుగా ఉన్న రహదారిలో ఏడుపదుల వయసులో ఓ వృద్ధురాలు అడుగు తీసి అడుగువేయలేని స్థితిలో పడి ఉన్నారు. కనీసం మాట్లాడలేకపోతున్న ఆమె.. అనాథగా రోడ్డుపై పడి ఉంది. ఇది గమనించిన స్థానికులు ఆమెకు అన్నం పెట్టి సపర్యలు చేశారు. ‘ఈనాడు-ఈటీవీ’ ప్రతినిధులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని స్థానిక కౌన్సిలర్ షేక్ ఖ్వాజా దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణం స్పందించిన ఆయన వైద్యులతో మాట్లాడి తుని ప్రాంతీయ ఆసుపత్రికి ఆటోలో తరలించారు. అక్కడ వైద్య సేవలదించడంతో పాటు భోజన సౌకర్యం కల్పించారు. కొద్ది రోజులకు ఆమె కోలుకున్న తర్వాత పట్టణ శివారులోని సాయి అన్నపూర్ణ ట్రస్ట్ వృద్ధుల ఆశ్రమానికి తీసుకువెళ్లి చేర్చారు.