ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్​తో సతమతమవుతున్న కోనసీమ - కోనసీమలో కరోనా పాజిటివ్ కేసులు న్యూస్

పచ్చగా ఉన్న కోనసీమపై కరోనా కన్నెర్ర చేస్తోంది. ఇప్పటి వరకు 131 కొవిడ్ పాజిటివ్ కేసులు రావటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రాంతాన్ని రెడ్​జోన్​గా చేస్తారో... ఎవరికి కరోనా మహమ్మారి సోకుతుందోనని భయపడుతున్నారు.

corona positive case raises in konaseema
కొవిడ్​తో సతమతమవుతున్న కోనసీమ

By

Published : Jun 20, 2020, 12:59 PM IST

కోనసీమను కరోనా కలవరపెడుతోంది. ఇప్పటివరకు మెుత్తం 131 పాజిటివ్ కేసులు నమోదు కావటంతో, కోనసీమ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రావులపాలెం మండలం మినహా, మిగిలిన 15 మండలాల్లో పాజిటివ్ కేసులు నమోదైనట్లు డీఎమ్​హెచ్​వో డాక్టర్ పుష్కరరావు వెల్లడించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ... జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

కోటనందూరులో మెుదటి పాజిటివ్ కేసు నమోదు

తూర్పు గోదావరి జిల్లా కోటనందూరు మండలంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. జగన్నాథపురం గ్రామంలో 39 ఏళ్ల మహిళకు వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్​లో పనులు చేసుకునే వీరు, ఈనెల 15 గ్రామానికి రావటంతో భార్యాభర్తలకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షల ఫలితాల్లో భార్యకు పాజిటివ్​గా రాగా... భర్తకు నెగిటివ్​గా తేలింది. దీంతో గ్రామాన్ని రెడ్​జోన్​గా ప్రకటించారు.

ఇదీ చదవండి:ఆడపిల్ల పుట్టిందని... బావిలో విసిరేశారు

ABOUT THE AUTHOR

...view details