కరోనా తీవ్రత దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణం.. ఈ ఏడాది కూడా ఏకాంతంగానే నిర్వహించనున్నారు. ఈ నెల 21 నుంచి 27 వరకు కల్యాణ ఉత్సవాలు జరగనున్నాయి. 22వ తేదీ రాత్రి స్వామి వారి కల్యాణం జరగనుంది. కరోనా ఆంక్షల నేపథ్యంలో కల్యాణ ఉత్సవాలకు భక్తులు ఎవర్నీ అనుమతించకుండా కేవలం కొద్ది మంది వైదిక బృందం, అధికారులతో ఆలయం లోపల ఉత్సవాలు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు.
ఏకాంతంగానే.. సత్యదేవుణి వార్షిక కల్యాణం
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాదీ.. అన్నవరం సత్యనారాయణ స్వామి వార్షిక కల్యాణం ఏకాంతంగా జరగనుంది. ఈ నెల 21 నుంచి 27 వరకు కల్యాణ ఉత్సవాలు నిర్వహించనున్నారు.
corona effect on annavaram temple