తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతాన్ని కరోనా వైరస్ ప్రజలను హడలెత్తిస్తోంది. ఇప్పటి వరకు 410 కేసులు నమోదైనట్లు అమలాపురం డివిజన్ అదనపు డీఎంహెచ్వో వైద్యుడు పుష్కరరావు వెల్లడించారు.
వీరిలో 160 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. ఆరుగురు ఈ వ్యాధితో మరణించారు. బుధవారం సంచార సంజీవని వాహనం ద్వారా 362 మందికి పరీక్షలు నిర్వహించగా... వీటిలో 20 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.