ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రావులపాలెం మండల పరిధిలోని గ్రామాల్లో ఇంటింటా శానిటైజేషన్ - రావులపాలెంలో కరోనా కేసులు

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి శానిటైజేషన్ చేసే ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు.

corona-cases-in-raavulapalem-mandal-east-godavari-district
రావులపాలెం మండల పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికీ శానిటైజేషన్

By

Published : Aug 17, 2020, 6:07 PM IST

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న గ్రామాలను ఏబీసీలుగా గుర్తించి చర్యలు చేపడుతున్నారు.

ఏ కేటగిరీగా గుర్తించిన రావులపాలెం, ఊబలంక, కొమర్రాజు గ్రామాల్లో శానిటైజేషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద 104 సేవలను ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details