తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కరోనా కేసులు 3వేలు దాటాయి. మొత్తం కేసుల సంఖ్య 3,043కు చేరింది. పలువురు ఈ మహమ్మారి బారిన పడి మృతిచెందారు.
అధికారులు రోజూ అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసుల సంఖ్య రోజురోజూకు పెరిగిపోవటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మాస్కులు, భౌతికదూరం పాటించమని చెప్తున్నా ఇంకా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మందుబాబులు ఈ విషయాలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా కరోనా నిబంధనలు పాటిస్తూ సరైన జాగ్రత్తలు తీసుకుంటే కేసుల సంఖ్యను అదుపులోకి తీసుకురావొచ్చని అధికారులు సూచించారు.