ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోనసీమలో కరోనా ఉద్ధృతి.. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు - కోనసీమలో కరోనా కేసుల వార్తలు

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. మంగళవారం వరకు మొత్తం 286 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతంలో 38 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసిన అధికారులు.. భద్రతా చర్యలను ముమ్మరం చేశారు.

corona cases in konaseema east godavari district
కోనసీమలో కరోనా ఉద్ధృతి

By

Published : Jul 8, 2020, 1:54 PM IST

తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతాన్ని కరోనా పీడిస్తోంది. పచ్చని గ్రామాల్లో వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. జులై 7 నాటికి కోనసీమ ప్రాంతంలో 286 కేసులు నమోదయ్యాయి. ప్రతి మండలంలోనూ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకు ఈ మహమ్మారితో ముగ్గురు మృతిచెందారు.

74 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 314 మందికి సంబంధించిన పరీక్ష ఫలితాలు రావాల్సి ఉంది. ఈ ప్రాంతంలో 38 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటుచేశారు. నిబంధనలు కఠినతరం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు.

ABOUT THE AUTHOR

...view details