తూర్పుగోదావరి జిల్లా తునిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకూ పట్టణ పరిధిలోనే కరోనా కేసులు 106కు చేరాయి. పట్టణంలో 30 వార్డుల్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో కేసులు నమోదు అవ్వడంతో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 10 గంటల తర్వాత ఎవరు బయటకు రావద్దని హెచ్చరించారు. అయినా అనేకమంది బయట తిరుగుతుండటంతో పోలీసులు చర్యలు చేపట్టి అవగాహన కల్పిస్తున్నారు.
తునిలో 100 దాటిన కరోనా కేసులు - east godavari dst covid news
తూర్పుగోదావరి జిల్లా తునిలో కరోనా ఉద్దృతి కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 106 కేసులు నమోదయ్యాయి. అధికారులు అప్రమత్తయ్యారు. కంటైన్మెంట్ జోన్లలో పహార కాస్తున్నారు.
corona cases in east godavari dst are increasing