తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నెల 14 నుంచి కోనసీమ వ్యాప్తంగా 16 మండలాల్లో దుకాణాలను ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. వ్యాపారులు ఈ నియమాలను పాటించాలని అమలాపురం డివిజన్ రెవెన్యూ అధికారి భవాని శంకర్ వెల్లడించారు.
అమలాపురంలోని 16 మండలాల్లో కొత్త నిబంధనలు - అమలాపురం వార్తలు
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అధికారులు చర్యలు చేపట్టారు. అమలాపురంలోని 16 మండలాల్లో పలు నిబంధనలు సూచించారు.
Amalapuram Corona cases
గత కొద్ది రోజులుగా కోనసీమకు ముఖ్య పట్టణంగా ఉన్న అమలాపురంలో మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరుస్తున్నారు. మంగళవారం నుంచి ఈ ప్రాంతంలోని 16 మండలాల్లో ఉదయం 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి వ్యాపారం చేసుకోవాలని ఆర్డీవో ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి:జమ్మూలో ఆర్మీ చీఫ్ పర్యటన