కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం అధికారులు అప్రమత్తమయ్యారు. లాక్డౌన్లో భాగంగా మండల పరిధిలోని 15 గ్రామాల్లో పూర్తి బంద్‌నకు పిలుపునిచ్చారు. దీంతో గ్రామాల్లోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. పాల కేంద్రాలు, ఔషధ దుకాణాలు మినహా మిగిలిన అన్ని దుకాణాలు మూతపడ్డాయి. ఆంక్షలు కొనసాగుతుండటంతో పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. కేసు నమోదైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా గుర్తించారు.
కరోనా ఎఫెక్ట్: ఉండ్రాజవరంలో పూర్తిస్థాయి బంద్ - కరోనా వైరస్ వార్తలు
కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండల పరిధిలో అధికారులు బంద్‌కు పిలుపునిచ్చారు.
eastgodavari district