ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంతా అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్​ మిశ్రా - crops

ఫొణి తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా ఆదేశించారు. మత్స్యకారులు ఎవరైనా వేటకు వెళ్లి ఉంటే..వారిని వెంటనే తిరిగి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

కలెక్టర్ సమీక్ష

By

Published : Apr 28, 2019, 5:59 AM IST

తుపానుపై కలెక్టర్ సమీక్ష

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్లో కలెక్టర్ కార్తీకేయ మిశ్రా అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫొణి తుపాను ప్రభావిత మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. వాతవరణ పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. మత్స్యకారులు ఎవరైనా వేటకు వెళ్లి ఉంటే..వారిని వెంటనే తిరిగి రప్పించే ప్రయత్నం చేయలన్నారు. సహాయ చర్యలకు రక్షణ బలగాలు సిద్ధంగా ఉండాలన్నారు. ధాన్యం కొనుగోలుకు తగిన ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details