తొలకరి చినుకులు.. మురిసిన జనాలు - east godavari
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వాతావరణం చల్లబడింది. తొలకరి పలకరింతతో జనం పులకరించారు.
వాతావరణం
ఇన్నాళ్లూ వేడిగాలులతో చెమటలు పట్టించిన వాతావరణం.. ఒక్కసారిగా మారిపోయింది. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్ళరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన, మమ్మిడివరం మండలాల్లో ఉదయం నుండి చల్లటిగాలులు వీస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. వాతావరణంలో వచ్చిన మార్పుతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు.