తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పోర్ట్ కార్యాలయం వద్ద సీఐటీయూ నిరసన చేపట్టింది. ప్రతి ఏడాది దేశ వ్యాప్తంగా పోర్టు ఆదాయం లక్షల కోట్ల రూపాయిలు ఉంటుందని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిక్కాల రాజ్ కుమార్ చెప్పారు. అలాంటి పోర్టులను ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఈ రంగంపై ఆధారపడినవారు తీవ్రంగా నష్ట పోతారని తెలిపారు.
అదానీ, అంబానీలకు లబ్ధి చేకూరే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర పోర్టు బిల్లు రద్దు చేయాలంటూ నాయకులు డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనాలు అందజేయాలని డిమాండ్ చేశారు.