'చిరుత కోసం వేట' - panther
తూర్పుగోదావరి జిల్లా బలుసు లంకలో చిరుత పులి కలకలం సృష్టించింది. ఇద్దరి వ్యక్తులపై దాడి చేసింది. ఓ ఇంట్లో దూరిన చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు వలను ఏర్పాటు చేశారు.
ఇద్దరు వ్యక్తులపై దాడి చేసిన చిరుతపులి
తూర్పు గోదావరి జిల్లా బలుసు లంక గ్రామంలో చిరుత కలకలం సృష్టించింది. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన ఇద్దరిపై పులి దాడి చేయడం తీవ్ర సంచలనం రేకెత్తించింది. గ్రామ సమీపంలోని అరటి తోటలో దాగి ఉన్న చిరుతను గుర్తించిన స్థానికులు... కర్రలు ఇతర ఆయుధాలతో దాడి చేసే ప్రయత్నం చేయగా వారిని తప్పించుకొని కొబ్బరి చెట్టు ఎక్కింది. అక్కడినుంచి దిగువన ఉన్న ఇంటిలో కి చేరింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఇంటి చుట్టూ వలలు ఏర్పాటు చేశారు.
Last Updated : Feb 14, 2019, 1:08 PM IST