తూర్పుగోదావరి జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు పైల బోసును... మాజీ హోంమంత్రి చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు పరామర్శించారు. బోసుపై వైకాపా నాయకులు అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలేశ్వరం, శంఖవరం, ప్రత్తిపాడు, రౌతులపూడి గ్రామాల తెదేపా నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టడాన్ని ఆక్షేపించారు. ఎన్ని బెదిరింపులకు పాల్పడినా... కార్యకర్తలు అధైర్యపడొద్దని.... వారికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.
అధైర్యపడొద్దు... అండగా ఉంటాం: చినరాజప్ప - చినరాజప్ప
తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై... అక్రమ కేసులు నమోదు చేయడాన్ని ఆ పార్టీ నేతలు చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ తీవ్రంగా తప్పుబట్టారు. తమ కార్యకర్తలను వేధించడం ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చినరాజప్ప