ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అవినీతి నిరూపిస్తే.. రాజకీయాలకు స్వస్తి: చినరాజప్ప

అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. వెయ్యి కోట్ల రూపాయలతో పెద్దాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని... మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు.

ఎన్నికల ప్రచారంలో హోం మంత్రి చినరాజప్ప

By

Published : Apr 2, 2019, 12:31 PM IST

ఎన్నికల ప్రచారంలో హోం మంత్రి చినరాజప్ప
అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పర్యటిస్తూ... ఎన్నికల ప్రచారం చేశారు. 1000 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. నియోజకవర్గంలో తనకు రెండు లక్షల మంది కుటుంబ సభ్యులు ఉన్నారని చినరాజప్ప చెప్పారు. 37 సంవత్సరాలుగా పార్టీలో ఉన్నానని... కష్టానికి గుర్తుగా ముఖ్యమంత్రి చంద్రబాబు తనని హోం మంత్రిని చేశారని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి....

ABOUT THE AUTHOR

...view details