బ్రహ్మాండమైన రాజధానిని నిర్మించాలనే తలంపుతో అమరావతి ఏర్పాటు చేస్తే.. వరద ముంపు సాకుతో దాన్ని మార్చాలనే ఆలోచన వైకాపా ప్రభుత్వం మానుకోవాలని తెదేపా నేత చినరాజప్ప హితవు పలికారు. కృష్ణా, గోదావరులకు వరదలు రావడం, విశాఖ వంటి సముద్ర తీర ప్రాంతాలకు తుపానులు రావడం సహజమని... ఆ వంకతో రాజధానిని తరలిస్తారా అని ప్రశ్నించారు. రాజధానిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఇప్పటికే అమరావతిలో భారీ స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల నివాసాల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. చంద్రబాబు చేపట్టిన అమరావతి నిర్మాణం మరింత బాగా చేసి పేరు తెచ్చుకోవాలని జగన్ ప్రభుత్వానికి సూచించారు. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల పేరిట ప్రస్తుతమున్న ఉద్యోగులను తొలగించడం సరికాదన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారం సద్వినియోగం చేసుకుని మంచి పాలన అందించాలన్నారు.
ముంపు సాకుతో రాజధానిని మార్చాలనుకుంటున్నారు!
వరద ముంపు సాకుతో రాజధానిని మార్చాలనుకోవటం సరికాదని తెదేపా నేత చినరాజప్ప తెలిపారు.
చినరాజప్ప