కరోనా మహమ్మారి విజృంభణతో ఇంటికే పరిమితమైన పిల్లలు.. చదువుకు దూరమవుతున్నారు. కానీ.. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో ఓ ఆసక్తికర దృశ్యం కెమెరాకు చిక్కింది. చిన్నపిల్లలు చదువుపై తమ ఆసక్తిని ప్రదర్శించారు. పుస్తకాలు పట్టుకుని ఇంటిముందు చెక్కబల్లపై కూర్చుని బుద్దిగా చదువుకుంటున్నారు. చదువుపై ఉన్న ఇష్టాన్ని చిన్నారులు ఇలా వ్యక్తం చేస్తున్నారు.
చక్కగా చదువుకుంటూ... సెలవుల్ని సద్వినియోగం చేసుకుంటూ! - godavari district latest news
కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచ వ్యాప్తంగా చదువులకు తీవ్ర అటంకం ఏర్పడింది. చిన్న పెద్దా అందరూ ఇంటికే పరిమితమైపోయారు. కొంతమంది ఆన్‌లైన్లో చదువుకుంటుంటే మరికొంతమంది ఆటపాటలతో కాలం వెళ్లదీస్తున్నారు.
చెక్క బల్లపై కూర్చోని చదువకుంటున్న విద్యార్థులు